హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): హరితనిధి నిధులతో వరంగల్ నుంచి మేడారం వరకు మల్టీ లేయర్ అవెన్యూ, మీడియన్ ప్లాంటేషన్లను రూ.6.63 కోట్లతో, వరంగల్, హనుమకొండ డీఎఫ్వోల పరిధిలో అవెన్యూ, మీడియన్ ప్లాంటేషన్లను రూ.5.6 కోట్లతో చేపట్టేందుకు స్టేట్ లెవల్ కమిటీ ఆమో దం తెలిపింది. మంగళవారం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అధ్యక్షతన సచివాలయంలోని అటవీ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో హరితనిధి పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.