సంబురంగా నిట్‌లో కాన్వొకేషన్
వరంగల్ నిట్ 21వ కాన్వొకేషన్ శనివారం సంబురంగా జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ విజయ్‌కుమార్ సారస్వత్, నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
- 8 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్
- 2,029 మందికి డిగ్రీల ప్రదానం
- విశిష్ట సంస్థల్లో వరంగల్ నిట్ ఒకటి
- నీతి ఆయోగ్ సభ్యుడు విజయ్‌కుమార్
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 16: వరంగల్ నిట్ 21వ కాన్వొకేషన్ శనివారం సంబురంగా జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ విజయ్‌కుమార్ సారస్వత్, నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ బ్రాంచీల్లోని 8 మందికి గోల్డ్‌మెడల్స్, 2,029 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. అనంతరం సారస్వత్ మాట్లాడుతూ.. దేశంలోని విశిష్ట సంస్థల్లో వరంగల్ నిట్ ఒకటని పేర్కొన్నారు. ఈ సంస్థ కాన్వొకేషన్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు.
దేశంలోనే ఇది మొదటి ప్రాంతీయ ఇంజినీరింగ్ కళాశాల(ఆర్ఈసీ) అని తెలిపారు. 64 ఏండ్లుగా ఈ సంస్థ.. దేశ సాంకేతిక, సామాజిక, ఆర్థిక అవసరాలను తీర్చడంలో తోడ్పడుతున్నదని వివరించారు. విద్య, శిక్షణలో సంస్థ ఉన్నత ప్రమాణాలను కొనసాగించడం అత్యంత సంతోషకరమని పేర్కొన్నారు. పాత తరంలో చాలా మందికి ఈ అవకాశం లేదని చెప్పారు. భారతదేశం ఇప్పటికే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నదని, ఇస్రో చంద్రయాన్-3 ల్యాండర్‌ను చంద్రుడిపై సురక్షితంగా దింపడం, ఆదిత్య ఎల్-1 ప్రయోగం ఇందుకు నిదర్శనమని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

