Warangal | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాగిరి చేస్తున్నారు. మానవ మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారు. ప్రశ్నించిన వారిపై కూడా దురుసుగా ప్రవర్తిస్తూ.. భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
తాజాగా వరంగల్ జిల్లాలో అడ్డు అదుపు లేకుండా కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు పాల్పడ్డారు. నర్సంపేట పట్టణంలోని మల్లంపల్లి రోడ్డులో ఓ దివ్యాంగుడి ఇంటిపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతి దాడికి పాల్పడ్డారు. ఆ ఇంటి యజమానితో పాటు భార్య, కుమారుడిపై చేయి చేసుకున్నారు. మహిళ అని కూడా చూడకుండా విచక్షణారహితంగా తిరుపతి అనుచరులు దాడి చేశారు. తమకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని జాతీయ రహదారిపై దివ్యాంగుడి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.
వరంగల్ జిల్లాలో అడ్డు అదుపు లేకుండా కాంగ్రెస్ నాయకుల అరాచకాలు
నర్సంపేట పట్టణంలోని మల్లంపల్లి రోడ్డులో ఓ దివ్యాంగుడి ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతి
మహిళ అని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడి చేసిన తిరుపతి అనుచరులు… pic.twitter.com/Q6nhXlxWes
— Telugu Scribe (@TeluguScribe) September 18, 2025