హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే యుద్ధం తప్పదని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. డెడికేటెడ్ కమిషన్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన నివేదిక అందజేసిందని, అందులో బీసీ జనాభా వివరాలన్నీ ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్, జనాభా లెకల ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు క ల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి రిజర్వేషన్లు పెంచకుండా ప్రభుత్వం తప్పించుకోవాలని కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.
సుప్రీంకోర్టు తీర్పు 20 ఏండ్ల కిందటిదని, అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 50 శా తం రిజర్వేషన్ సీలింగ్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఎత్తేసిందని వివరించా రు. రిజర్వేషన్ల కల్పనకు ఇప్పు డు ఎలాంటి సీలింగ్ లేదని పేర్కొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.