Sarpanch Elections | రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు బరితెగిస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టడమే కాకుండా బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికే పలువురు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వార్నింగ్‌లు ఇవ్వగా.. తాజాగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేయొద్దని ప్రజలను బహిరంగంగా హెచ్చరించారు.
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండల పరిధిలో జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను చెప్పినోళ్లను కాకుండా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే వారిని నా క్యాంప్ ఆఫీసులోకి రాకుండా మెడ పట్టి గెంటేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ తరఫున ఒక్క వార్డు మెంబర్ గెలిచినా కూడా అభివృద్ధి పనుల కోసం నా దగ్గరికే రావాలని.. అప్పుడు వారిని తన క్యాంప్ ఆఫీసు నుంచి బయటకు మెడపట్టి గెంటేస్తానని హెచ్చరించారు. మీ గ్రామాల్లో ఒక్క అభివృద్ధి పని కూడా చేయనని వార్నింగ్ ఇచ్చారు. మేఘా రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.
వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
వనపర్తి నియోజకవర్గం అడ్డాకుల మండలం చిన్నమునగాలచేడులో పంచాయతీ ఎన్నికల పర్యటనలో ఎమ్మెల్యే మేఘారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
నేను చెప్పినోళ్లని కాకుండా వేరే వాళ్ళని సర్పంచ్ గా గెలిపిస్తే మెడలు పట్టి బయటకు తోసేస్తా
మీ… https://t.co/AnSNFoCYcG pic.twitter.com/1ZqAc07w0w
— Telugu Scribe (@TeluguScribe) December 14, 2025
బ్రేకింగ్ న్యూస్
బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే వారిని నా క్యాంప్ ఆఫీసులోకి రాకుండా మెడ పట్టి గెంటేస్తాను
ఒక్క అభివృద్ధి పని కూడా చేయను
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో సర్పంచ్… pic.twitter.com/IDplRwJmgk
— Telugu Scribe (@TeluguScribe) December 14, 2025