సంగెం, మే 13: పోలింగ్ బూత్‌లో ఓటేసి వీవీప్యాట్ స్లిప్‌ను సెల్ఫోన్లో ఫొటోతీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడం వరంగల్ జిల్లా సంగెం మండలంలో కలకలం సృష్టించింది. మండలంలోని ఎల్గూర్‌స్టేషన్ గేట్ తండాకు చెందిన ఓ యువకుడు 211 పోలింగ్ స్టేషన్లో ఓటేసి వీవీ ప్యాట్ స్లిప్‌ను ఫొటో తీసి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రూపులో పోస్ట్ చేశాడు.
అది సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీంతో ఎల్గూర్స్టేషన్కు చెందిన బీఆర్ఎస్ నాయకులు సెక్టార్ అధికారికి ఫిర్యాదు చేశారు. సదరు అధికారి స్పందించకపోవడంతో వాగ్వాదానికి దిగారు. సదరు ఓటరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ పోలింగ్ కేంద్రానికి చేరుకుని సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.