Muncipal Elections | కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓటింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 48.54 శాతం పోలింగ్
Muncipal Elections | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 48.54 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోంది.
Muncipal Elections | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 48.54 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ లక్ష్యంగా అక్కడక్కడా దాడులకు దిగింది.
పోలీసులు కూడా అధకార కాంగ్రెస్‌పట్ల పక్షపాతం చూపుతూ విపక్షాలపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. బాన్సువాడ మున్సిపాలిటీలో పోలింగ్ బూత్ దగ్గర బందోబస్తులో ఉన్న ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకే ఓటేయండి అంటూ ఓటర్లను ప్రలోభపెట్టారు. మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్‌ను పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈడ్చుకుంటూ బయటికి తీసుకొచ్చారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. బీఆర్ఎస్ తిరగబడటంతో ఇరువర్గాల వాళ్లు గల్లాలు పట్టుకుని కొట్టుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్మోహన్రావు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆందోళనకు దిగారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

