బీజేపీకి అవకాశం ఉరితో సమానం
తెలంగాణలో బీజేపీని ఒక్కసారి గెలిపిస్తే ఉరి వేసుకొన్నట్టేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ఉరి ఒక్కసారి వేసుకొంటే, రెండోసారికి అవకాశం ఉండదని
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బీజేపీని ఒక్కసారి గెలిపిస్తే ఉరి వేసుకొన్నట్టేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ఉరి ఒక్కసారి వేసుకొంటే, రెండోసారికి అవకాశం ఉండదని చెప్పారు. విభజన చట్టంలోని హామీలు, మహిళా రిజర్వేషన్లు, తెలంగాణలో చేసిన అభివృద్ధిని చెప్పలేకపోయిన అమిత్షా.. దీనంగా తెలంగాణ ప్రజల కాళ్లు పట్టుకొని అడుక్కొన్నారని (లెగ్ బెగ్గింగ్) ఎద్దేవా చేశారు. బీజేపీ లాంటి ప్రమాదకర పార్టీని బలపరిచేందుకు ఎలాంటి అవకాశాలు ఇవ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తుందనడం విడ్డూరం: చాడ
విభజన చట్టంలోని హామీలను పట్టించుకోని అమిత్షా.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పుకోవడం విడ్డూరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. సామరస్యానికి ప్రతీకైన తెలంగాణలో బీజేపీ నాయకులు మత విద్వేషాలు రగిలించేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆరాటం తప్ప, తెలంగాణ అభివృద్ధి పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని అమిత్షా ప్రసంగంతో స్పష్టమైందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- commit
- CPI Narayana
- Suicide
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

