హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టులో ‘ఓటుకు నోటు కేసు’పై విచారణ మరోసారి వా యిదా పడింది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల కింద విచారణ జరపాలని సీఎం రేవంత్రెడ్డి, తన పేరును తొలగించాలని సండ్ర వెంకటవీరయ్య పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. వాటిపై బుధవారం రేవంత్రెడ్డి తరపున న్యాయవాది ముకు ల్ రోహత్గి వాదనలు వినిపించారు. మ రో మీటింగ్తో వాదనలు వినలేకపోతున్నామని జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ విజ య్ బిష్ణోయి ధర్మాసనం స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను గురువారానికి వా యిదా వేస్తున్నట్టు ప్రకటించింది.