హైదరాబాద్, ఆక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఓటర్ల జాబితాలో చేర్చిన దొంగ ఓట్లను తక్షణమే తొలగించి, కొత్త ఓటర్ల జాబితాతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిర్వహించాలని సీపీఐ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలీ ఉల్లాఖాద్రీ డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం ఎలక్షన్ కమిషన్ను కలిసి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారు కోరారు.