హైదరాబాద్ : నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా నుమాయిష్ ( Nampally Numaish ) ను ఒకరోజు నాంపల్లి నుమాయిష్‌ను సందర్శకులు వాయిదా వేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ( VC Sajjanar ) సూచించారు. అగ్నిప్రమాదం కారణంగా ఘటనా ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిందని, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సందర్శకులు తమ ఎగ్జిబిషన్ పర్యటనను రేపటికి ( ఆదివారం ) వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నాంపల్లిలో బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో ( Furniture Store ) భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనంలో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు చిక్కుకున్నట్లు సమాచారం . ఫైరింజన్లు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
గ్రౌండ్ ఫ్లోర్ నుంచి దట్టమైన పొగలు రావడంతో వారు బయటకు రాలేక పై అంతస్తుల్లోనే ఉండిపోయారు. జేసీబీలు, భారీ క్రేన్ల సహాయంతో భవనం పైభాగంలో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది.