Viral Video | తమకు ఇష్టంలేకుండా లవ్ మ్యారేజి చేసుకుందని ఓ తల్లిదండ్రులు కన్నకూతుర్నే కిడ్నాప్ చేశారు. యువకుడి ఇంటికి వెళ్లిన బంధువులు కూతురి కళ్లలో కారం చల్లి, ఈడ్చుకుంటూ కారులో తమ ఇంటికి తీసుకెళ్లారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో ఈ ఘటన జరిగింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరకు చెందిన బాల నర్సింహ, మహేశ్వరి దంపతుల కుమార్తె శ్వేత.. అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడిని ప్రేమించింది. వారి పెళ్లికి శ్వేత కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. అయినప్పటికీ వారికి ఇష్టం లేకుండానే ప్రవీణ్‌ను నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకుంది. అతని ఇంట్లోనే ఉంటుంది. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కోపంలో ఉన్న పేరెంట్స్ బుధవారం ప్రవీణ్ ఇంటికి వెళ్లారు. బంధువుల సాయంతో శ్వేతను కిడ్నాప్ చేశారు.
బుధవారం తెల్లవారుజామునే శ్వేత కుటుంబసభ్యులు ప్రవీణ్ ఇంటికి వెళ్లి దాడి చేశారు. శ్వేత కళ్లలో కారం చల్లి, బట్టలతో కట్టేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కారు ఎక్కించారు. అడ్డొచ్చిన ప్రవీణ్, అతని కుటుంబసభ్యులపై నాకర్రలతో దాడి చేశారు. ఈ తతంగమంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రవీణ్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రేమ వివాహం చేసుకున్న కూతురిని ఎత్తుకెళ్లిన తల్లిదండ్రులు
అడ్డొచ్చిన యువకుడి కుటుంబ సభ్యుల కళ్లల్లో కారం చల్లి దాడి చేసిన యువతి తరుపు బంధువులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో 4 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ప్రవీణ్, శ్వేత అనే వ్యక్తులు
ఈరోజు ప్రవీణ్ ఇంటిపై దాడి చేసి… pic.twitter.com/eSHMW79SEE
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2025