హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ తరఫున స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు.
- ఘోష్ కమిషన్ నివేదిక కోర్టులో నిలువదని ఆనాడే చెప్పాం
- మాజీ ఎంపీ వినోద్‌కుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ) : పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ తరఫున స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ రిపోర్టు న్యాయస్థానాల్లో నిలువదని ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన రోజే చెప్పామని ఆయన గుర్తుచేశారు. కమిటీ విచారణ సందర్భంగా సహజ న్యాయసూత్రాలు పాటించలేదని విమర్శించారు.
కాంగ్రెస్, టీడీపీ ఒక్క ప్రాజెక్టూ కట్టలేదు
కేవలం ఎస్సారెస్పీ తప్ప గోదావరి నదిపై కాం గ్రెస్, టీడీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని బోయినపల్లి విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరిపై పది బరాజ్‌ల వరకు నిర్మించి వందల టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకున్నామని పే ర్కొన్నారు. కేసీఆర్ హ యాంలో మిడ్ మానేరులో ఎండాకాలంలో నీ ళ్లు కనిపించేవని, ఇప్పుడు మాయమయ్యాయని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉంటుందనే హెచ్చరికలతో రేవంత్‌రెడ్డి మేడిగడ్డకు కదిలారని మండిపడ్డారు. మేడిగడ్డను రిపేర్ చేయకపోతే ఉత్తర తెలంగాణకు తాగునీళ్లు ఉండవని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి తిట్ల పురాణం తప్ప ఏదీ చేతకాదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ కుర్చీకి సొంత పార్టీ నేతలతోనే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఆల్మట్టి ప్రాజెక్టు విస్తరణ, భూసేకరణ కోసం రూ.లక్ష కోట్లు కేటాయించిందని వినోద్‌కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ నేతలు దేవీప్రసాద్, లీగల్ సెల్ ప్రతినిధులు కల్యాణ్‌రావు, కిరణ్, వేణుగోపాల్‌రావు, ప్రవీణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

