న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తా
హైకోర్టు న్యాయవాదుల సమస్యలను పరిషరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ కొత్త కార్యవర్గ సభ్యులు ఆదివారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో వినోద్‌కుమార్‌తో
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): హైకోర్టు న్యాయవాదుల సమస్యలను పరిషరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ కొత్త కార్యవర్గ సభ్యులు ఆదివారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో వినోద్‌కుమార్‌తో సమావేశమయ్యారు. కొత్త కార్యవర్గానికి వినోద్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమ సమస్యలను వినోద్‌కుమార్ దృష్టికి న్యాయవాదులు తీసుకొచ్చారు.
హైకోర్టులోని మెడికల్ డిస్పెన్సరీని అప్‌గ్రేడ్ చేసి వైద్య సిబ్బందిని నియమించాలని, లైబ్రరీకి నిధులు మంజూరు చేయాలని, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన శిక్షణ పొందే న్యాయవాదులకు స్టాండింగ్ కౌన్సిల్‌గా అవకాశాలు కల్పించాలని, జూనియర్ న్యాయవాదులకు ైస్టెఫెండ్ మంజూరు చేయాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు చెంగల్వ కల్యాణ్‌రావు, కార్యదర్శి దేవేందర్, కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

