మంథనిరూరల్, మార్చి 21: మంచినీటి కోసం వారం నుంచి ఇబ్బంది పడుతుంటే.. గేట్వాల్ హోల్‌ను మట్టితో నింపడం ఏంటని మిషన్ భగీరథ అధికారులను పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్లో శుక్రవారం గ్రామస్తులు నిలదీశారు. మంత్రి నియోజకవర్గంలో ఇలా ఉంటే మారుమూల గ్రామాల్లో ప్రజలకు నీటి కష్టాలు ఇంకా ఎలా ఉన్నాయోనని మండిపడ్డారు. గ్రామంలో సుమారుగా 3వేల మంది ఉంటే.. ఎంత మందికి మంచినీరు అందిస్తున్నారో అధికారులు వెల్లడించాలన్నారు. మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాట్లాడుతూ.. ఎగ్లాస్పూర్లో పరిమితికి మించి మంచినీటిని వాడడంంతో దిగువన ఉన్న గ్రామాలకు మంచినీరు సరఫరా కావడం లేదన్నారు. రోజుకు 1.20లక్షల లీటర్ల నీటిని గ్రామానికి అందిస్తున్నామని తెలిపారు.