రంగారెడ్డి, జనవరి 9 (నమస్తేతెలంగాణ) : గ్రీన్ఫీల్డ్ రోడ్డు పేరుతో బువ్వపెట్టే భూములను దూరం చేయవద్దని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామస్తులు అధికారులను వేడుకున్నారు. శుక్రవారం గ్రీన్ఫీల్డ్ రోడ్డుకోసం సర్వే నిర్వహించడానికి వచ్చిన అధికారులను లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథనాయక్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి భూ నిర్వాసితులతో కలిసి అడ్డుకున్నారు.
అనంతరం వంటావార్పు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బలవంతంగా భూములు తీసుకోవాలని చూస్తే న్యాయపోరాటానికి సిద్ధమని, ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.