ఆదిలాబాద్ : కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలను(Power cuts) నిరిస్తూ ప్రజలు ఆందోళన బాటప డుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాలు అంధకారంలో మగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్(Adilabad) జిల్లా తలమడుగులో(Talamadugu Villagers) విద్యుత్ కోతలు నిరసిస్తూ గ్రామస్తులు సబ్ స్టేషన్ కార్యాలయాన్ని(Sub-station) ముట్టడించారు.
కరెంటు కోతలు ఎందుకు విధిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. రాత్రి సమయంలో ఎక్కువగా కరెంటు లేకపోవడంతో తాము ఉక్కపొతతో ఇబ్బందులు పడుతున్నామని, గతంలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కోరారు. కాగా, పైనుంచి విద్యుత్ సరఫరా జరగడం లేదని అధికారులు గ్రామస్తులకు సూచించారు.