నర్సాపూర్ (జీ), ఫిబ్రవరి 2 : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ)లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినితో నాలుగు రోజుల క్రితం అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థిని శనివారం తల్లిదండ్రులకు విషయం వివరించడంతో పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలని విద్యార్థిని తల్లిదండ్రులు డీఈవోను కోరారు.
బయ్యారం, ఫిబ్రవరి 2 : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట ఎస్సీ కాలనీకి చెందిన చెన్నయ్య చిన్నారులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో గమనించిన స్థానికులు శనివారం రాత్రి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తిరుపతి తెలిపారు.