పంచాయతీల పాత బిల్లులు రద్దు!
గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పను లు చేసిన కాంట్రాక్టర్లు, సామగ్రి సరఫరా చేసి న వెండర్లకు కాంగ్రెస్ సర్కార్ షాక్ ఇచ్చింది. రెండేండ్ల్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఇం టిగ్రేటెడ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఐఎఫ్ఎంఐఎస్) పోర్టల్ లో ఒకసారిగా తిరసరించారు.
- ‘ఐఎఫ్ఎంఐఎస్’ లోచెక్కుల తిరస్కరణ
- పంచాయతీ సెక్రటరీల బదిలీలు, జీపీ కొత్త పాలకవర్గాల ఏర్పాటు
- ఆందోళనలోకాంట్రాక్టర్లు, వెండర్లు
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పను లు చేసిన కాంట్రాక్టర్లు, సామగ్రి సరఫరా చేసి న వెండర్లకు కాంగ్రెస్ సర్కార్ షాక్ ఇచ్చింది. రెండేండ్ల్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఇంటిగ్రేటెడ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఐఎఫ్ఎంఐఎస్) పోర్టల్ లో ఒకసారిగా తిరసరించారు. దీంతో పను లు చేసిన కాంట్రాక్టర్లు, మెటీరియల్ అందించిన వెండర్లు దికుతోచని స్థితిలో పడ్డారు. 2023 ఫిబ్రవరి 1తో గ్రామాల్లో పాత పాలకవర్గాల గడువు ముగిసి, ప్రత్యేక అధికారుల పాలన వచ్చింది. కొత్త పాలకవర్గాల కొలువుదీరే (ఈ ఏడాది ఫిబ్రవరి 22) వరకు అధికారులు గ్రామాల నిర్వహణ చేపట్టారు. పంచాయతీల్లో కాంట్రాక్టర్లు పనులు చేపట్టగా, అవసరమైన మెటీరియల్‌ను వెండర్లు అందించా రు. పంచాయతీల్లోని జనరల్ ఫండ్, సొంత వనరులు, రాష్ట్ర ఆర్థిక సంఘం(ఎస్ఎఫ్సీ), కేంద్ర ఆర్థిక సంఘం(సీఎఫ్‌సీ) నిధులకు సంబంధించి 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో పలు పనులు జరిగాయి.
పారిశుధ్యం, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు వంటి అత్యవసర పనుల కోసం ఒకో పంచాయతీ లో రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చయింది. సర్పంచులు, ఉప సర్పంచుల డిజిట ల్ సంతకాలతో బిల్లులు జనరేట్ చేసి ట్రెజరీకి పంపారు. ఆర్థిక సంవత్సరం ముగియగానే చెకులను రిజెక్ట్ చేయాల్సి ఉన్నది. కానీ, సాం కేతిక కారణాలు, నిధుల సర్దుబాటు కోసమో రెండేండ్లుగా వీటిని ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లోనే ఉంచారు. వాటిని తిరసరించడంతో వెండర్ల ఆశలు అడియాశలయ్యాయి. గతం లో పనులు చేయించిన సర్పంచుల పదవీకాలం ముగియడం, కొత్త పాలక వర్గాలు రా వడంతో పాత బిల్లులు ఎవరు చెల్లిస్తారని ఆం దోళన చెందుతున్నారు. పనులను పర్యవేక్షించిన సెక్రటరీలు సైతం బదిలీపై వెళ్లడంతో, అధికారులు తమకు సంబంధం లేదని చెప్తున్నారు. దీంతో బకాయిలు రావాల్సిన మాజీ సర్పంచులు, వెండర్లు తలలు పట్టుకుంటున్నారు. నిధుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు.
మున్సిపల్ విలీన గ్రామాల్లో చిక్కులు
కొన్ని పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో అకడ సర్పంచులు, సెక్రటరీలు అందుబాటులో లేరు. మున్సిపల్ అధికారులు ఈ బిల్లుల అంశం తమ పరిధిలోకి రాదని నిరాకరించే అవకాశం ఉండటంతో ఆ గ్రామాల్లోని వెండర్లు మరింత ఆందోళన చెందుతున్నారు. జనరల్ ఫండ్, ఆర్థిక సంఘం నిధుల నుంచి రావాల్సిన ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బాధితులు కోరుతున్నారు. రిజెక్ట్ అయిన బిల్లులను మళ్లీ జనరేట్ చేసేలా ప్రస్తుత అధికారులకు ఆదేశాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

