Telangana | ప్రభుత్వంలో పనిచేసే అన్ని రకాల ఉద్యోగుల ఆధార్, సెల్‌ఫోన్ నంబర్‌తోసహా పూర్తి వివరాలను శనివారం అర్ధరాత్రిలోగా ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
అక్టోబర్ నెలకు సంబంధించి రెగ్యులర్, తాతాలిక ఉద్యోగుల వివరాలను ఈ నెల 25లోగా ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశించారు.
వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియను ప్ర భుత్వం వేగవంతం చేసింది. విద్యార్హతలు, ఖాళీల ఆధారంగా వివిధ శాఖల్లోకి 20, 555 మంది వీఆర్ఏలను సర్దుబాటు చేసే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది.