హైదరాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): అక్టోబర్ నెలకు సంబంధించి రెగ్యులర్, తాతాలిక ఉద్యోగుల వివరాలను ఈ నెల 25లోగా ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్‌లోని వివిధశాఖల హెచ్వోడీలకు ఉత్తర్వులు జారీచేశారు. సెక్రటేరియట్‌లోని శాఖలు, శాఖల హెచ్వోడీలు ఉద్యోగుల ఆధార్ కార్డు వివరాలు, సెల్ నంబర్, రెగ్యులర్/తాతాలిక/కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్/గౌరవ వేతనం/ఆక్టివిటీ ఔట్సోర్సింగ్/ఎంటీఎస్/డైలీవేజ్/పార్ట్‌టైమ్/ఫుల్ టైమ్/గెస్ట్ సర్వీసెస్‌కు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రతినెల 10వ తేదీలోగా ఉద్యోగుల వివరాలు అప్డేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ అనేక శాఖలు ఆలస్యం చేస్తున్నాయని, ఇకపై అలా కుదరదని హెచ్చరించారు.