Telangana | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలో పనిచేసే అన్ని రకాల ఉద్యోగుల ఆధార్, సెల్‌ఫోన్ నంబర్‌తోసహా పూర్తి వివరాలను శనివారం అర్ధరాత్రిలోగా ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శనివారం అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపించారు. పోర్టల్‌లో వివరాలు పొందపర్చని ఉద్యోగుల అక్టోబర్ నెల వేతనాలను విడుదల చేయబోమని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో శాశ్వత, తాతాలిక ఉద్యోగులు మొ త్తం 10.14 లక్షల మంది ఉన్నారు. వీరందరి పేర్లు, హోదా, ఆధార్, ఫోన్ నంబర్లు తదితర వివరాలన్నీ ప్రతి నెలా 10 వరకు ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్ (ఐఎఫ్ఎంఐఎస్)లో నమో దు చేయాలని గత నెల సెప్టెంబర్‌లో ఉత్తర్వు లు జారీ అయ్యాయి.
ఈ నెల 16 వరకు సగం మంది వివరాలు కూడా పోర్టల్‌లో నమోదు చేయలేదు. 5.21 లక్షల మంది శాశ్వత ఉద్యోగులకుగాను 2.22 లక్షల మంది వివరాలే నమోదయ్యాయి. ఇక తాత్కాలిక ఉద్యోగుల్లో 4.93 లక్షల మందికిగాను 2.74 లక్షల మంది వివరాలే నమోదు చేశారు. ఏ ఒక శాఖ కూడా వందశాతం ప్రక్రియను పూర్తి చేయలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ శాఖలు, సంస్థ లు, పీఎస్‌యూలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ఇతర సంస్థల్లో పనిచేసే ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్, దినసరి వేతనాలకు పనిచేసే వివిధ రకాల ఉద్యోగుల పూర్తి వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదుచేయాలని మరోసారి ఆదేశించారు. కొన్ని కార్యాలయా ల్లో తాతాలిక ఉద్యోగులు మానేసినా, అనధికారికంగా సుదీర్ఘ సెలవులో వెళ్లినా వారి పేర్ల తో వేతనాలు డ్రా చేస్తున్నారనే విమర్శలు ఉ న్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల వివరాలను నమోదు చేయడం ద్వారా ఎంతమంది పనిచేస్తున్నారనే స్పష్టమైన వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. పోర్టల్‌లో ఉద్యోగుల వివరాలను నమోదు చేయడం వల్ల వేతనాల చెల్లింపులో పారదర్శకత ఉంటుందని అధికారవర్గాలు చెప్తున్నాయి.
చిరుద్యోగులపై కత్తి
ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు భారీ సంఖ్యలోనే ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులపై అవగాహన ఉం డదు. ఇప్పటికే మూడుసార్లు ఆధార్‌కార్డు అప్డేట్ చేయాలన్నారు. ప్రభుత్వం వద్దే ఔట్సోర్సింగ్ ఏజెన్సీల సమాచారముంటుంది. ఏజెన్సీల ద్వారా అప్డేట్ చేయవచ్చు. లేదా ఆ ఏజెన్సీలను రద్దుచేయవచ్చు. అలా చేయకుం డా ఉద్యోగుల వేతనాలు కట్ చేస్తామనడం అత్యంత దారుణమని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. చిరుద్యోగుల్లో ఎక్కువగా ము న్సిపాలిటీ, స్థానిక సంస్థల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులే ఉన్నారు. చిరుద్యోగులకు నష్టం జరిగితే ఊరుకోబోమని, వేతనాలు ఆపితే సహిం చే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. బోగస్ ఉద్యోగులున్నారని లీకులిస్తున్నారంటే ఇన్నాళ్లు కండ్లుమూసుకున్నారా? అని ప్రశ్నించారు. 20 నెలలుగా వేతనాలెలా ఇచ్చారని నిలదీస్తున్నారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను ఎందుకు కట్టడిచేయలేకపోతున్నారని అంటున్నారు. ఇప్పటికే కొన్ని శాఖల్లో ఉద్యోగుల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. మైనా ర్టీ పాఠశాలల్లో మూడు-నాలుగు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమశాఖల్లోనూ ఇదే పరిస్థితి. ఆరోగ్యశాఖలో ఆలస్యంగా వేతనాలందాయి.
కార్పొరేషన్ హామీ ఏమైనట్టు
ఆర్థికశాఖ ద్వారా అందిన సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో 4.94లక్షల మంది ఉద్యోగులు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరిలో 81,341 కాంట్రాక్ట్ ఉద్యోగులు కాగా, మరో 53వేల మంది మల్టీపర్సస్ ఉద్యోగులు. 1.27లక్షల మంది ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తుండగా, డెయిలీవేజెస్, ఎన్ఎంఆర్, ఎంటీఎస్, సెర్ప్‌లో మరో 13వేల మంది పనిచేస్తున్నారు. గౌరవ భృతి పొందుతున్న వారు 2.18లక్షల మంది ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేస్తామని కాంగ్రెస్ హామీనిచ్చింది. ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని తెలిపిం ది. కానీ పీఠమెక్కాక ఈ హామీని విస్మరించిం ది. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఉద్యోగులకు భద్రత, కమీషన్ల దందాకు చెక్ పడుతుంది. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు, కార్పొరేషన్ హామీని బుట్టదాఖలు చేసేందుకే ఆధార్‌కార్డులను తెరపైకి తెచ్చారని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నేత శ్రీధర్ ఆరోపించారు.
హెచ్వోడీలను తీసివేయాలి
ఇప్పటివరకు ఏయే శాఖల్లో ఐఎంఎఫ్ఐఎస్ పోర్టల్‌లో ఉద్యోగుల వివరా లు నమోదు చేయలేదో ఆ శాఖ హెచ్‌వోడీ, ఎండీ, ఉన్నత అధికారులను ఉ ద్యోగంలో నుంచి తీసివేయాలి. ప్రభు త్వ సీఎస్ నుంచి ఆదేశాలు వచ్చినా స్పందించడం లేదంటే.. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమీ ఉండదు. మీరు ఎటువంటి తప్పు చేయనపుడు ఎందు కు నమోదు చేయడం లేదు? మీరు గవర్నమెంట్‌ను ఎంత మోసం చేశా రో? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అధికారుల నిర్లక్ష్యానికి మేము శిక్ష అనుభవించాలా? ఇది ఎకడి న్యాయం? వాళ్లకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనం పడుతున్నది. అందుకే వాళ్లకు మా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బాధ తెలియ దు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీతం కూడా నిలిపివేయాలి. అప్పుడు మా బాధ తెలుస్తుంది. లేనిపక్షంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ పోరాటం చేస్తుంది. -తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ