తాండూర్, మే 14 : ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది ఎవరైనా రైతులను ఇబ్బందులు పెడితే కేసులు నమోదు చేస్తామని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారీ హెచ్చరించారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం గోనూర్, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌లోని రైస్ మిల్లులను, తాండూర్ పట్టణంలోని డీసీఎంఎస్ మక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందులు కలిగితే రైతులు నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. రవాణా విషయంలో రైతులకు సహకారం లభించకపోతే టెండర్ తీసుకున్న కాంట్రాక్టర్‌పై కేసులు నమోదు చేస్తామని స్పష్టంచేశారు.