కరీమాబాద్/కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 16 : రాష్ట్రవ్యాప్తంగా గురువారం పలు జిల్లా కేంద్రాల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కరీంనగర్లోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రికార్డులను పరిశీలించా రు.
ప్రైవేట్ వ్యక్తులు కార్యాలయంలో ఇష్టారాజ్యంగా తిరుగుతుండటాన్ని ప్రశ్నించారు. దీనిపై నివేదిక ఉన్నతాధికారులకు అందిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలోని ఖిలావరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్ వెంకట్లాల్ను విచారించి, పలు దస్తావేజులను తీసుకెళ్లినట్టు సమాచారం.