జగిత్యాల రూరల్, నవంబర్ 20: ‘జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్‌కుమార్ పార్టీ మారలేదంటున్నారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని చెబుతున్నరు. కాంగ్రెస్‌లో చేరకపోతే జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి కండువా కప్పుకోవాలి’ అని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యా సాగర్‌రావు సవాల్ విసిరారు.
గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి మీడియాతో మాట్లాడారు. సంజయ్ పార్టీ మారకపోతే బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనాలని, కార్యకర్తలతో కలిసి తిరగాలని సూచించారు.