మా ఇండ్లు కూల్చొద్దు
హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణా న్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆదివారం ఆందోళనకు దిగారు. తమ నివాసాలను కూల్చి దవాఖానను నిర్మించొద్దంటూ ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించి, గోషామహల్ చౌరస్తాలో ధర్నా చేశారు.
- ఉస్మానియా దవాఖాన భవన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసన
- గోషామహల్ చౌరస్తాలో స్థానికులు, బాధితుల ధర్నా
అబిడ్స్, మార్చి 22: హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణా న్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆదివారం ఆందోళనకు దిగారు. తమ నివాసాలను కూల్చి దవాఖానను నిర్మించొద్దంటూ ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించి, గోషామహల్ చౌరస్తాలో ధర్నా చేశారు. ఆ ప్రాంతంలో రహదారులు, నాలా విస్తరణ కోసం భవన యజమానుల నుంచి స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడంపై మండిపడ్డారు.
దవాఖాన ని ర్మాణం, రహదారుల విస్తరణ వల్ల వంద ల మంది భవన యజమానులు ఆస్తులు కోల్పోనున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గాలున్నప్పటికీ ప్రభుత్వం తమ ప్రాంతంలోనే నిర్మించేందుకు చర్యలు చేపట్టడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరసనతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి, అక్కడి నుంచి పంపేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

