KTR | కేటీఆర్‌ను కలిసిన గోదావరిఖని సింగరేణి క్వార్టర్ల బాధితులు
KTR | రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్(Raj Thakur Makkan Singh) అరాచక పాలనపై సింగరేణి క్వార్టర్స్ (Singareni Quarters )కూల్చివేత బాధితులు కేటీఆర్‌ను కలిశారు. తమకు న్యాయం చేయాలని కేటీఆర్‌ను వేడుకున్నారు.
పెద్దపల్లి : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) సందర్శన రెండో రోజు కొనసాగుతున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేతృత్వంలో హైదరాబాద్ నుంచి బయల్దే రిన ప్రజా ప్రతినిధుల బృందం.. గురువారం సాయంత్రం కరీంనగర్లో లోయర్ మానేరు రిజర్వాయర్‌ను పరిశీలించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం రామగుండం ఎన్టీపీసీ నుంచి కన్నెపల్లికి బయల్దేరి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించారు.
ఈ క్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్(Raj Thakur Makkan Singh) అరాచక పాలనపై సింగరేణి క్వార్టర్స్ (Singareni Quarters )కూల్చివేత బాధితులు కేటీఆర్‌ను కలిశారు. తమకు న్యాయం చేయాలని కేటీఆర్‌ను వేడుకున్నారు. గోదావరిఖనిలో లక్ష్మి నగర్ షాపింగ్ కాంప్లెక్స్ డెవలప్మెంట్ అంటూ సింగరేణి క్వార్టర్లు కూల్చివేశారని కేటీఆర్‌కు బాధితులు మొరపెట్టుకున్నారు. 82 క్వార్టర్లకు కరెంట్, నీళ్లు కట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చర్చించాలని కేటీఆర్‌ను బాధితులు వేడుకున్నారు. వారి సమస్యలపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

