‘సార్ మా వాళ్లు చనిపోయారని అనిపిస్తుంది. వాళ్లు బతికి ఉండే చాన్స్ లేదు. చెప్తున్నా వినకుండా మా వాళ్లు ఆ రాత్రి డ్యూటీకి వెళ్లారు. టన్నెల్ మా వాళ్లను బలి తీసుకున్నది. ప్రభుత్వం కనికరించి వారి కుటుంబసభ్యులకు ఒక్కొక్కరికి రూ.5 కోట్ల చొప్పున పరిహారం చెల్లించాలి’ అం టూ ప్రమాద బాధితుల కుటుంబసభ్యులు, తోటి కార్మికులు ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు.
ప్రెస్‌మీట్ అనంతరం మాజీ మంత్రి హరీశ్‌రావు కంట్రోల్ రూమ్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులంతా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ‘నమస్తే తెలంగాణ’ బాధితులతో మాట్లాడిం ది. ‘మట్టి పడుతుందని అంతకుముందు డ్యూటీ చేసినవాళ్లు చెప్పారు. వెళ్లకపోతే డ్యూటీ ఆపేస్తారేమోనని మా వాళ్లు డ్యూటీకి వెళ్లారు. ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలో తెలియదు. వస్తున్నారు.. వెళ్తున్నారు.. తట్టెడు మట్టి తీసిన పాపన పో లేదు. ఏం జరుగుతుందో చెప్పడమే లేదు’.