కంది, మార్చి 1: ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్ ఆదివారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. శనివారం కలెక్టర్ వల్లూరు క్రాంతి ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తితో కలిసి ఐఐటీలోని హెలీపాడ్, సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించారు. ప్రోటోకాల్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.