రాజన్న సిరిసిల్ల : గత బీజేపీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. మోదీ(PM Modi) మతం అనే సెంటిమెంట్ వాడుకుంటూ లబ్ధి పొందుతున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్. హనుమంతారావు(VH Hanumanta Rao) అన్నారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో కేదార్నాథ్, మొన్న కన్యాకుమారి వెళ్లి స్వామి వినేకానంద స్వామి దగ్గర కూర్చుని ధ్యానం చేశాడు.
వివేకానంద స్వామి అన్ని మతాలను సమానంగా చూసేవారని గుర్తు చేశారు. మోదీ మతం పేరు మీద ధ్యానం చేశారని ఆరోపించారు. ఎగ్జిట్స్ పోల్స్‌లో ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయి. ఆ ఫలితాలు ప్రజల అభిమతాన్ని వ్యక్త పరుచలేదని వాటిని తాము నమ్మే స్థితిలో లేమని స్పష్టం చేశారు. గతంలో కూడా ఎగ్జిట్స్ పోల్స్ వ్యతిరేకంగా వచ్చాయని ఆయన తెలిపారు.
బీజేపీ ప్రభుతం రెండు లక్షల ఉద్యోగాలు, 15 లక్షల అకౌంట్లో వేస్తామన్నారు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదని విమర్శించారు. పబ్లిక్ సెక్టార్ ద్వారా కాంగ్రెస్ అనేక ఉద్యోగాలు కల్పిస్తే మోదీ మాత్రం అదాని, అంబానీలకు దేశ సందపదను కట్టబెట్టారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం వస్తే అగ్రకుల నాయకులకు పదవులు కట్టబెడుతాడని హెచ్చరించారు.