హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టీ ప్రభాకర్‌రావు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదిస్తూ ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావుపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే హార్డ్డిస్, పరికరాల ధ్వంసం జరిగిందన్న వాదనను వ్యతిరేకిస్తూ.. రివ్యూ కమిటీ ఆ దేశాల మేరకే వాటిని ధ్వంసం చేశారని తెలిపారు. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వర్రావు వా ది స్తూ ప్రభాకర్‌రావుకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు ఇంప్లీడ్ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ శ్రీనివాసరావు ప్రకటించారు.