ఊటూర్, ఆగస్టు 12 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణంలో కోల్పోతున్న భూములకు ఎకరాకు రూ.60 లక్షల పరిహారం, ఇంటికో ఉద్యో గం ఇవ్వాలని భూనిర్వాసితుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకట్రామారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఊ ట్కూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట భూనిర్వాసితులతో కలిసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను అధికారులు భయాందోళనకు గురిచేసి సంతకాలు పెట్టించుకోవడం సరికాదని హితవుపలికారు. ప్రభుత్వం ఎకరాకు రూ.14 లక్షల ఇస్తే రైతులు నష్టపోతారని, ఈ ధరకు అర ఎకరం పొలం కూడా రాదని చెప్పారు. రేవంత్ సర్కారు స్పందించి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.