హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీవోఏ) హైదరాబాద్ సిటీ కమిటీ నూతన అధ్యక్షుడిగా వెంకట్ గండూరు, కార్యదర్శిగా నిరంజన్‌రెడ్డి, ట్రెజరర్‌గా స్వర్ణలత ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం అసోసియేషన్ భవన్లో రాష్ట్ర నేతలు ఏలూరి శ్రీనివాస్, సత్యనారాయణ సమక్షంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు ప్రకటించారు.
కమిటీ అసోసియేట్ ప్రెసిడెంట్‌గా శిరీష, ఉపాధ్యక్షులు బాబుబేరి, లావణ్య, వినోద్‌రెడ్డి, స్పోర్ట్స్ సెక్రటరీ వై శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివకుమార్, కల్చరల్ సెక్రటరీ యశోద, పబ్లిసిటీ సెక్రటరీ యాదగిరి, కార్యాలయం కార్యదర్శులుగా ప్రభాకర్ శ్రీవాత్సవ, గంగారెడ్డి తదితరులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర మహిళా ప్రతినిధి దీపారెడ్డి, సంయుక్త కార్యదర్శి పరమేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యాదగిరి, హైదరాబాద్, మేడ్చల్, జిల్లాల అధ్యక్షులు కృష్ణయాదవ్, శ్రీనివాసమూర్తి, నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.