డ్రగ్స్ కేసు పేరిట బీఆర్ఎస్పై కక్ష.. కేటీఆర్
‘బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు డ్రగ్స్ వాడటం దురదృష్టకరం. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయానికి నేను, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం. మాదకద్రవ్యాల వాడకం, చట్టవిరుద్ధ కార్యాకలాపాలను తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
- వినియోగం, విక్రయానికి మేం వ్యతిరేకం
- బాధ్యులెవరైనా కఠినంగా శిక్షించాల్సిందే
- ఏ పరీక్షకైనా సిద్ధమని ఎన్నోసార్లు చెప్పిన
- నా పేరు లాగితే చట్టపరమైన నోటీసులిస్తా
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ‘బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు డ్రగ్స్ వాడటం దురదృష్టకరం. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయానికి నేను, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం. మాదకద్రవ్యాల వాడకం, చట్టవిరుద్ధ కార్యాకలాపాలను తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. కొందరు నీచ రాజకీయాల కోసం డ్రగ్స్ కేసు పేరిట బీఆర్ఎస్పై కక్ష సాధిస్తున్నారని ఆదివారం ఎక్స్ వేదికగా విమర్శించారు.
మనుషులను రాక్షసులుగా మార్చే మాదకద్రవ్యాలను బాధ్యతాయుతమైన పదవులు, హోదాల్లో ఉన్న వ్యక్తులు వినియోగించడం సరికాదని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ వాడుతున్న, విక్రయిస్తున్న వారిని రాజకీయాలు, పదవులతో సంబంధం లేకుండా చట్టప్రకారం కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టంచేశారు.
అయితే కొందరు, తామంటే గిట్టని రాజకీయ పార్టీలు తమ నీచ రాజకీయాల కోసం బీఆర్ఎస్ను డ్రగ్స్ కేసులోకి లాగేందుకు యత్నిస్తున్నాయని తీవ్రంగా ఖండించారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఊరుకొనే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ‘డ్రగ్స్ వినియోగంపై ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించాను.
ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సూచనలను స్వాగతిస్తున్నాను. మనమందరం ఆదర్శంగా నిలుద్దాం’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. ఇంత స్పష్టంగా చెప్తున్నప్పటికీ ప్రతి డ్రగ్స్ కేసులోకి తన పేరును లాగాలని చూస్తే ఊరుకొనే ప్రసక్తిలేదని, చట్టపరమైన నోటీసులిస్తానని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

