బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 18:19:45

రెవెన్యూ డివిజన్ గా వేములవాడ

రెవెన్యూ డివిజన్ గా వేములవాడ

హైదరాబాద్ : ప్రజల చెంతకు పాలన అందించడంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుంది. పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటి ఫలాలు మరింత చేరువ చేసేందుకు అవసరమైన అన్ని చోట్ల రెవెన్యూ డివిజన్ లను ఏర్పాటు చేస్తున్నది. దీంతో ఎన్నో ఏండ్లుగా సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఎంతో మేలు కలుగుతున్నది. తాజాగా సిరిసిల్ల జిల్లాలో ఆరు మండలాలతో వేములవాడ, వేములవాడ రూరల్, చందుర్తి, బోయిన్ పల్లి, కోనారావుపేట, రుద్రంగి మండలాలతో వేములవాడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యకర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 71 రెవెన్యూ డివిజన్లు ఉండగా వేములవాడ రెవెన్యూ డివిజన్ తో కలిపి మొత్తం సంఖ్య 72కు చేరింది. ప్రభుత్వ నిర్ణయంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.logo