కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 23 : సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని సెంట్ర ల్ వర్క్‌షాప్‌లో సోమవారం నిర్వహించిన క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో టీబీజీకేఎస్ అభ్యర్థి వేముల శైలేష్కిరణ్ సొసైటీ డైరెక్టర్‌గా ఘన విజయం సాధించారు. మొత్తం 59 ఓట్లకు.. 49 ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచి గులాబీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భం గా టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసన వీరభద్రం, విజయ్‌కుమార్, కంచర్ల శ్రీనివాస్, ప్రసాద్ ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంబురాలు చేసుకున్నారు.