హైదరాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి తాను ముఖ్యమంత్రిని అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని, బాధ్యత కలిగిన సీఎం, హోంశాఖ పదవిలో ఉంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం దారుణమని మండిపడ్డారు.
ఎన్డీఎస్ఏ నివేదికను అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి.. నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని కనీసం ఒకసారైనా ఇంజినీర్లతో మాట్లాడారా? అని ప్రశ్నించారు.