నిజామాబాద్ : సీఆర్‌కు కష్టకాలంలో వెంట ఉన్నది ఎవరో ముందు కవిత తెలుసుకోవాలి. నీ వల్ల నీ తండ్రి కేసీఆర్ ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఆలోచించావా కవిత? మిమ్మల్ని కలుపడానికే ప్రయత్నించానే తప్పా విడగొట్టడానికి కాదు అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తనపై మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై వేముల స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఏం చేశానే ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు స్పష్టంగా తెలుసన్నారు. పార్టీ లైను దాటిన తర్వాతనే కవితపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పార్టీకి వ్యవస్థాపక సభ్యులం
నేను మా తండ్రి వేముల సురేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి వ్యవస్థాపక సభ్యులం . 2001 తెలంగాణ ఆవిర్భావా ని కన్న ముందే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. బీఆర్ఎస్ అంటేనే ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అంటేనే బీఆర్ఎస్ పార్టీ. కవిత మధ్యలో వచ్చిండ్రు మధ్యలో పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీతో నేను మంతనాలు చేశానని అంటున్న కవిత… ఇప్పుడు కష్ట కాలంలో కేసీఆర్ వెంట ఉన్నది నేనా కవితనా? అని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీలో, అసెంబ్లీ బయట, జిల్లాలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది ఎవరో అందరికి తెలుసన్నారు.
లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో ఉన్న నేను కాంగ్రెస్‌లోని ఎవరితో మంతనాలు చేయలేదని స్పష్టం చేశారు. కవిత కాంగ్రెస్ నాయకులతో రహస్యంగా మంతనాలు చేయలేదని చెప్పగలదా? అని నిలదీశారు. నిరాధారణమైన ఆరోపణలు ఎవరి లాభం కోసం చేస్తున్నావని మండిపడ్డారు. స్వలాభం కోసం వ్యక్తిగత ప్రతిష్టలు దెబ్బ తీసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని హితవు పలికారు. నాపై నిరాధారమైన ఆరోపణలు చేసే హక్కు కవితకు లేదని తెలిపారు. మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నా వాళ్లను కవిత టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
అధికార పార్టీకి కవిత న్యాయం చేస్తున్నది
కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న వారిని కవిత టార్గెట్ చేస్తుంది. ప్రత్యక్షంగా మా నాయకత్వాన్ని బలహీనపరిచి పరోక్షంగా అధికార పార్టీకి కవిత న్యాయం చేస్తుందని విమర్శించారు. కవిత సభలో కన్నీళ్లు పెట్టుకోవడం రాజకీయంగా సింపతిని గేన్ చేయడానికి అని అర్ధం అవుతుందని, అది ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నామని పేర్కొన్నారు. కవిత చేసే ఈ పనుల వల్ల కేసీఆర్ ఎంత మనోవేదనకు గురవుతున్నారో బిడ్డగా ఆమె ఆలోచించ డం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్
ఆయన పైన కేటీఆర్ పైన విమర్శలు చేయగా లేనిది మాపై చేయడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదన్నారు. కానీ బాధగా అనిపించిందన్నారు. కవితను రెండుసార్లు ఎమ్మెల్సీగా చేయడంలో నా పాత్ర ఏందో కేసీఆర్‌కు బాగా తెలుసు. కవిత పై మొన్నటి వరకు కేసీఆర్ బిడ్డగా గౌరవం ఉండేది. నిన్నటి మాటలతో ఆ గౌరవాన్ని కవిత పోగొట్టుకుందన్నారు.
నీ వల్ల నీ తండ్రి కేసీఆర్ గారు ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఆలోచించావా కవిత?
సొంత తండ్రి, సొంత అన్ననే విమర్శించినప్పుడు, నన్ను విమర్శించడం ఆశ్చర్యం కలిగించలేదు
నువ్వు రెండో సారి ఏకపక్షంగా ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడంలో నా పాత్ర ఏంటో కేసీఆర్ గారికి తెలుసు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే… pic.twitter.com/VIfYzSWM2C
— Telugu Scribe (@TeluguScribe) September 1, 2026