IND vs WI : గువాహటి వన్డేలోనూ వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్(101) చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో అర్ధ శతకంతో శుభారంభమిచ్చిన ఈ చిచ్చరపిడుగు ఈసారి మెరుపు శతకంతో కదం తొక్కాడు. భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన క్యాంప్‌బెల్ 65 బంతుల్లోనే మూడంకెల స్కోరందుకున్నాడు. తద్వారా టీమిండియాపై సెంచరీ బాదిన 14వ విండీస్ క్రికెటర్‌గా.. ఇండియాపై వేగవంతమైన వంద కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడీ హిట్టర్.
రెండో వన్డేలో వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్(101: 68 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకంతో రెచ్చిపోయాడు. గువాహటిలో భారత బౌలర్లను ఉతికేసిన అతడు బౌండరీల మోతతో అలరించాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన క్యాంప్‌బెల్ కేవలం 65 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. భారత గడ్డపై వన్డేల్లో వంద కొట్టిన 14వ విండీస్ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడీ డాషింగ్ ఓపెనర్. అంతేకాదు.. వన్డేల్లో వేగవంతమైన సెంచరీ బాదిన ఐదో కరీబియన్ ప్లేయర్‌గా.. టీమిండియాపై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచూరియన్‌గా క్యాంప్‌బెల్ అవతరించాడు.
బ్రియాన్ లారా, 1999 – 45 బంతుల్లో
క్రిస్ గేల్, 2019 – 55 బంతుల్లో
ఈ లెవిస్, 2024 – 61 బంతుల్లో
నికోలస్ పూరన్, 2023 – 63 బంతుల్లో
జాన్ క్యాంప్‌బెల్,2026 – 65 బంతుల్లో
షాయ్ హోప్, 2025 – 66 బంతుల్లో
జాన్ క్యాంప్‌బెల్ – 65 బంతుల్లో
రిచర్డ్ పావెల్ బంతుల్లో – 72 బంతుల్లో
మార్లోన్ శామ్యూల్స్ – 73 బంతుల్లో
షిమ్రన్ హిట్మైర్ -74 బంతుల్లో
షిమ్రన్ హిట్మైర్ – 85బంతుల్లో