మోర్తాడ్, జనవరి 5: ఈ నల్లా నుంచే మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నయ్. సీఎం కేసీఆర్ చేపట్టిన ఇంటింటికీ మంచినీటి పథకమే.. మిషన్ భగీరథ. ఆ పథకం కిందనే ఈ నల్లాను ఏర్పాటుచేసింది.. ఆ నల్లాలోంచి వస్తున్నవే భగీరథ నీళ్లు.. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌లో కొమ్ముల వెంకటేశ్ ఇంట్లో ఏర్పాటు చేసిన నల్లా ఇది. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా గ్రామానికి వెళ్లిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో ఆ నల్లా తిప్పి, అక్కడున్న లక్ష్మీ అనే మహిళతో మాట్లాడారు. ‘నీళ్లు రోజూ వస్తున్నాయా, ఎంతసేపు వస్తున్నాయి’ అని అడగ్గా రోజు గంటసేపు వస్తున్నాయని, నీళ్లకు గోస లేదని ఆమె జవాబిచ్చారు.
భగీరథ నీళ్లు రోజు అస్తున్నయ్. అవే నీళ్లు పట్టుకుంటం, తిమ్మాపూర్‌ల ఇంతకు ముందు నీళ్ల కోసం గోసవడ్తుంటిమి. భగీరథ అచ్చినంక నీళ్ల తిప్పలు తప్పినయి.
–లక్ష్మీ, తిమ్మాపూర్, నిజామాబాద్ జిల్లా