పసుపు కొనుగోలుపై ప్రభుత్వాల నిర్లక్ష్యం
పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు.
- బహిరంగ వేలాన్ని నిలిపి వేయాలి
- ఎమ్మెల్యే వేముల డిమాండ్
మోర్తాడ్, ఏప్రిల్ 15: పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో ‘ఈ-నామ్’ కాకుం డా బహిరంగవేలంతో పసుపు కొనుగోలు జరగడంతో మద్దతు ధర పొందలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు నిజామాబాద్ గంజ్లో ధర్నా నిర్వహించి తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వెల్లడించారు. పసుపు రైతులు పంట అమ్ముకోవడంలో ఉన్న ఇబ్బందులను తొలగించడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రె స్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీగా అర్వింద్, జాతీయ పసుపుబోర్డు చైర్మన్ ఉండి కూడా లాభం లేకుండా పోయిందని విమర్శించారు. ఇటీవల ఎంపీ అర్వింద్ ఈ-నామ్ 1.50 కింద కొనుగోలు ప్రారంభిస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదని, సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి కొనుగోలు నిలిపివేసి వేలం నిర్వహించడం అన్యాయమని పేర్కొన్నారు. మొదట ఈ-నామ్ 2.50 గురించి మాట్లాడి తర్వాత 1.50 అని చెప్పి రైతుల్లో గందరగోళం సృష్టించారని విమర్శించారు. దళారులు కుమ్మ క్కై తక్కువ ధరకు పసుపు కొనుగోలు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వేలాన్ని నిలిపివేయాలని, ఈ-నామ్ విధానంలో కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

