హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : టీ-ఐడియా (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్), టీ-ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దలిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్) పథకాల కింద మళ్లీ వాహనాలకు సబ్సిడీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సంపూర్ణ సౌర విద్యుత్తు గ్రామంగా నాగర్‌కర్నూల్ జిల్లా కొం డారెడ్డిపల్లి రికార్డులకెక్కింది. టీజీరెడ్కో ద్వారా ఈ గ్రామాన్ని పూర్తి సోలార్ గ్రామంగా తీర్చిదిద్దారు. గ్రామంలో మొ త్తం 514 ఇండ్లతోపాటు, 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్తు సౌకర్యం కల్పించారు. కొండారెడ్డిపల్లిలో సంపూర్ణ సోలార్ ప్రాజెక్ట్ కోసం రూ. 10.53కోట్లను వెచ్చించారు.