Minister Seethakka | ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవనంలో గురువారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి వేడుకలలో భాగంగా మహిళా సంఘాల సభ్యులు మంత్రి సీతక్కకు స్వాగతం పలికేందుకు వినూత్నంగా కూరగాయలతో బతుకమ్మలను పేర్చారు. అన్ని రకాల కూరగాయలతో కూడిన ఓ బతుకమ్మను మంత్రి సీతక్క తన తలపై పెట్టుకుని ముందుకు నడవసాగింది. అంతలోనే ఉన్నట్టుండి.. ఆ కూరగాయల బతుకమ్మ కూలిపోయింది. దీంతో కూరగాయలన్ని చెల్లాచెదురై పోయాయి. ఉన్న కూరగాయలను సర్దుకుని మంత్రి సీతక్క ముందుకు నడచింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.