TG Police : తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ మచ్చుకైనా కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్న పోలీసులు బీఆర్ఎస్ నాయకులతో దుందుడుకుగా ప్రవర్తిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బయట దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి (Kethireddy Vasudeva Reddy)ని పోలీసులు తోసేశారు. మాట్లాడుతున్న ఆయనను అడ్డుకుంటూ వెనక్కి తీసుకెళ్లబోయారు. ఈ క్రమంలోనే తోపులాటలో ఒక్కసారిగా ఆయన కిందపడిపోయారు.
ఈ ఘటనలో వాసుదేవరెడ్డికి గాయాలయ్యాయి. దాంతో, ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసుల తీరును నిరసిస్తూ స్టేషన్ ముందే ఆందోళనకు దిగారు. మీడియా గొంతు నొక్కడమే కాకుండా, నేతలపై భౌతిక దాడులకు దిగుతారా అని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల అత్యుత్సాహం.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతుండగా దివ్యాంగుల మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డిని తోసేసిన పోలీసులు
పోలీసుల తోపులాటలో ఒక్కసారిగా కిందపడిపోయిన రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్
ఈ ఘటనలో వాసుదేవరెడ్డికి గాయాలు.. దీంతో స్టేషన్ ముందే… https://t.co/9KmPsURB8F pic.twitter.com/yzITL842HA
— Telugu Scribe (@TeluguScribe) January 27, 2026
హైదరాబాద్
జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర పోలీస్ ల ఓవరాక్షన్.సిట్ నోటీసులో భాగంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియాతో మాట్లాడుతుంటే నన్ను తోసేశారు.
మీడియా గొంతు నొక్కడమే కాకుండా, నేతలపై భౌతిక… pic.twitter.com/gwJ1flLIb0
— Dr.Kethireddy Vasudeva Reddy (@KVRBRS1) January 27, 2026