హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 14 ఏండ్ల తర్వా త రిజిస్ట్రార్, సంచాలకులు, డీన్‌తోపాటు పలు కీలక పదవులకు పూర్తిస్థాయి నియామకాలు జరిగాయి. రిజిస్ట్రార్‌గా డాక్టర్ జీఈసీహెచ్ విద్యాసాగర్, పరిశోధనా సంచాలకులుగా డాక్టర్ ఎం బలరాం, పీజీస్టడీస్ డీన్‌గా కేబీ ఈశ్వరి, విస్తరణ సంచాలకులుగా డాక్టర్ ఎం యాకాద్రి, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్‌గా డాక్టర్ చల్లా వేణుగోపాల్‌రెడ్డి, డీన్ ఆఫ్ అగ్రికల్చర్‌గా డాక్టర్ కే ఝాన్సీరాణి, డీన్ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌గా డాక్టర్ కేవీ రమణరావు, లైబ్రేరియన్‌గా డాక్టర్ జే వివేక్వర్ధన్ నియమితులయ్యారు. ఈ పోస్టులతోపాటు మరో 10మందిని కీలక పరిశోధన సంస్థలు, కేంద్రాలకు సంచాలకులుగా నియమించారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జానయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరు మూడేండ్లపాటు పదవీలో కొనసాగనున్నారు. నియమితులైన 18మందిలో ఐదుగురు మహిళ ప్రొఫెసర్లు ఉన్నారని జానయ్య వివరించారు. జనరల్ క్యాటగిరీ వర్గానికి చెందిన ఆరుగురిని, వెనుకబడిన వర్గాలకు చెందిన ఎనిమిది మందిని, ఎస్సీ వర్గాలకు చెందిన ముగ్గురిని, ఎస్టీ వర్గానికి చెందిన ఒకరిని నియమించినట్టు వెల్లడించారు.