RGIA | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి ప్రతికూల వాతావరణం ఏర్పడడం కారణంగా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాల ల్యాండింగ్‌కు అధికారులు అనుమతివ్వలేదు. దీంతో కొన్ని విమానాలు బెంగళూరు, విజయవాడ వైపు మళ్లించారు. లక్నో, కోల్‌కతా, ముంబై, జైపూర్ నుంచి వచ్చే విమానాలను బెంగళూరు ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే ఫ్లైట్‌ను విజయవాడకు మళ్లించారు. ఇక బుధవారం ఉదయం నాటికి వాతావరణం అనుకూలంగా ఉండడంతో.. అన్ని విమానాలు యథావిధిగా కొనసాగుతున్నాయని శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.