ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలి : వంటేరు ప్రతాప్ రెడ్డి
ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ వదులుతున్న కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేయాలని గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ డిమాండ్ చేశారు.
మనోహరాబాద్, జూలై 12 : ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ వదులుతున్న కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేయాలని గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయి పల్లి గ్రామంలో ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని గ్రామస్తులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఒకరోజు దీక్ష నిర్వహించారు.
ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ కాలుష్యాన్ని వదలడంతో గాలి నీరు కలుషితమై ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు. కాలుష్యంతో వ్యవసాయ పంటలు నష్టం జరుగుతుందని దీంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. తాగునీరు కలుషితమై రంగాయి పల్లి చెట్ల గౌరారం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. వ్యవసాయ బోర్లలో కలుషితమైన నీరు రావడంతో తాగునీటి సమస్యతో పాటు పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.
పరిశ్రమలు ఒకరికి కూడా ఉపాధి ఇవ్వడం లేదని బీహార్ తో పాటు ఇతర రాష్ట్రాల వరకు చెందిన వారికి ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. ఉపాధి లేని పరిశ్రమలు ఇక్కడ ఎందుకని, ఇక్కడి వనరులు ఉపయోగించుకొని స్థానికేతరులకు ఉద్యోగాలు కనిపిస్తున్నారని తెలిపారు. పరిశ్రమ అనుమతులు రద్దు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

