ముషీరాబాద్, నవంబర్ 7: ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన బీఆర్ఎస్కే వచ్చే ఎన్నికల్లో మాదిగలు, మాది గ ఉపకులాలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్యమాదిగ వెల్లడించారు. హైదరాబాద్ విద్యానగర్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించినట్టు తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం కేసీఆర్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి రాష్ట్ర ప్రతినిధి బృందాన్ని పంపారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మాదిగల అభ్యున్నతి కోసం విశేష కృషి చేస్తున్నదని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించకుండా మాదిగ యువకుల ప్రాణాలను బలి తీసుకున్న కాంగ్రెస్, వంద రోజుల్లో వర్గీకరణ అంటూ మోసం చేసిన బీజేపీకి మాదిగ, ఉపకులాల ప్రజలు ఓటు వేయొద్దని కోరారు.