నేలకొండపల్లి, మార్చి 29 : అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడతాంటూ బీజేపీ మాదిగలను మోసం చేసిందని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. టీఎస్ ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బొడ్డు రాము ఇటీవల మృతిచెందడంతో మంగళవారం వంగపల్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వంగపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఒత్తిడి తీసుకురాగా కొన్ని రాష్ర్టాలు ఒప్పుకోవడం లేదని బీజేపీ చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ల మధు, జాతీయ ఉపాధ్యక్షుడు లంక వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు పడిశాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.