కేసీఆర్ హయాంలోనే వల్మిడికి వన్నె.. ఎర్రబెల్లి దయాకర్‌రావు
వాల్మీకి రామాయణాన్ని రచించిన వల్మిడి మునులగుట్టపై రూ. 10 కోట్లతో రామాలయాన్ని నిర్మించి, రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయంగా తీర్చిదిద్దినట్టు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.
- అనేక ఆలయాలను పునరుద్ధరించిన బీఆర్ఎస్ సర్కార్: ఎర్రబెల్లి
దేవరుప్పుల, జూన్ 26 : వాల్మీకి రామాయణాన్ని రచించిన వల్మిడి మునులగుట్టపై రూ. 10 కోట్లతో రామాలయాన్ని నిర్మించి, రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయంగా తీర్చిదిద్దినట్టు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. అమెరికాలోని డాలస్‌లో బీఆర్ఎస్ అభిమాని, ఎన్నారై సురభి శ్రీనివాస్ ఇంట్లో జరిగిన శ్రీనివాస కల్యాణానికి హాజరైన ఎర్రబెల్లి అక్కడి భక్తులకు కేసీఆర్ హయాంలో తెలంగాణలో జరిగిన దేవాలయాల అభివృద్ధిని వివరించారు. రూ.వందల కోట్లతో నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు.
ప్రముఖ శైవకవి పాల్కురికి సోమనాథుడు జన్మించిన పాలకుర్తి, కవి పోతన జన్మించిన బమ్మెర, వాల్మీకి రామాయణం రాసిన విశిష్ట స్థలం వల్మిడి మునులగుట్టను తాను మంత్రిగా ఉన్న సమయంలో రూ. వంద కోట్లతో అభివృద్ధి చేశామని వివరించారు. ఈ మూడింటిని కలిపి ఆధ్యాత్మిక, టూరిజం కారిడార్‌గా చేసేందుకు నిధు లు కేటాయించగా, ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. పాలకుర్తి, బమ్మెర, వల్మిడి చరిత్రను వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

